తెలంగాణ

గ్యాస్ సిలిండర్లు వాడేవారికి లాస్ట్ ఛాన్స్-జూన్ 30 వరకే టైమ్

గ్యాస్ సిలిండర్లు వాడేవారికి లాస్ట్ ఛాన్స్-జూన్ 30 వరకే టైమ్

నవదిశ, తెలంగాణ బ్యూరో: గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడుతున్న వారందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలి. జూన్ 30వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే గ్యాస్ సబ్సిడీ నిలిచిపోనుంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ అందించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను తప్పనిసరి చేశారు. ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ నిధులు మాత్రమే నిలిచిపోతాయి, గ్యాస్ బుకింగ్ యథావిధిగా చేసుకోవచ్చు. డెలివరీ బాయ్ వద్ద బయోమెట్రిక్ మెషిన్ ద్వారా, గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి, లేదా గ్యాస్ కంపెనీ యాప్, వెబ్ సైట్ల ద్వారా ఆన్లైన్లో ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.