నవదిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలో కేంద్ర పౌర విమానాశ్రయ శాఖామంత్రి రాంమోహన్ నాయుడును రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టాలి అని విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ స్థాపనపై చొరవ తీసుకోవాలని కోరారు.
కొత్తగూడెం ప్రాంతం పారిశ్రామిక, ఖనిజ వనరులకు కేంద్రంగా ఉందని, ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తే భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు సౌకర్యం కల్పించడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విన్నవించారు. కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు రాష్ట్ర ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రులు వెల్లడించారు.

