తెలంగాణ

పామాయిల్ దిగుమతి పన్ను పై తుమ్మల విజ్ఞప్తి

పామాయిల్ దిగుమతి పన్ను పై తుమ్మల విజ్ఞప్తి

నవదిశ, తెలంగాణ బ్యూరో : క్రూడ్ పామాయిల్ దిగుమతులపై ఇంపోర్ట్ టాక్స్ 44 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. దిగుమతి పన్ను పెంచితే స్థానిక రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని, పామాయిల్ సాగు విస్తరణకు ఊతం ఇచ్చినట్లు అవుతుందన్నారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరించి రాష్ట్రాన్ని పామాయిల్ హబ్‌గా మారుస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎం ఎస్ పి ప్రకారం కొనుగోలు చేసిన పంటలను కేంద్రమే తీసుకోవాలని డిమాండ్ చేశామన్నారు. యూరియా సరఫరాలో కేంద్రం కేటాయించిన కోటా ప్రకారం సరఫరా చేయాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.