నవదిశ, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమగ్ర బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో రవీంద్రభారతిలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన బీమా భద్రతను అందించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

